రెండు డోసుల టీకా తీసుకున్నవారు 6 నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కొవిడ్ నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. బూస్టర్ డోసు తీసుకున్న 90శాతం మందిలో కరోనా వైరస్ ఆల్ఫా, బీటీ, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లను నివారించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు భారత్ బయోటెక్ పేర్కొంది.