శ్రీలంక కు చెందిన క్రికెటర్ ధనుష్క గుణతిలక టెస్టు క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఇప్పటివరకు మొత్తం 8 టెస్టులు 8 ఆడిన అతడు.. 299 రన్స్ చేశాడు. వన్డేలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 30 ఏళ్ల గుణతిలక వెల్లడించాడు.
అయితే గుణతిలకతోపాటు మరో ఇద్దరిపై శ్రీలంక బోర్డు విధించిన ఏడాది నిషేధం ఎత్తివేసిన రోజే అతడు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇటీవలే భానుక రాజపక్సె క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.