దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని గుర్తించారు. మహరాష్ట్ర-1,009, ఢిల్లీ-513, కర్ణాటక-441, రాజస్థాన్-373 కేసులు రాగా.. TS-123, AP-28 కేసులు నమోదయ్యాయి. ఇక, మొత్తం బాధితుల్లో 1,409 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.