దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,59,632 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18వేల కేసులు ఎక్కువగా వచ్చాయి. పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 10.21%గా నమోదైంది. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల 90వేలు దాటింది. ఇక 24గంటల్లో కరోనా మహమ్మారితో మరో 327 మంది మరణించారు. 40,863 మంది కోలుకున్నారు.