దేశంలో కరోనా భీభత్సానికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్ర కరోనాతో అల్లాడిపోతుంది.రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి.ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఆ రాష్ట్రంలో ఏకంగా 40,925 కొత్త కరోనా కేసులు నమోదవ్వడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.
గడిచిన ఇరవై నాలుగంటల్లో దాదాపు 20మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ఒమిక్రాన్ కేసుల్లోనూ మహారాష్ట్ర నే ముందు వరుసలోనే ఉంది.
అక్కడ 876 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని నిర్ధారణ అయింది అని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే కరోనా కట్టడికై ఆంక్షలు ఆ విధించింది.