పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో 173 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న కూడా ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 125 మంది కొవిడ్ పాజిటివ్ గా తేలారు.
