దక్షిణాఫ్రికతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.సౌతాఫ్రికా ఏడు వికెట్లతో తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది.సౌతాఫ్రికాకు చెందిన బ్యాట్స్ మెన్ ఎల్గర్ 97పరుగులు(నాటౌట్)ను సాధించి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.
టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 202,సెకండ్ ఇన్నింగ్స్ 266పరుగులకు ఆలౌట్ అయింది.ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 229పరుగులకు ఆలౌట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లను కోల్పోయి 243పరుగులను చేసింది.
మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించడంతో సీరిస్ సమం అయింది..ఎవరు విజేతనో తెల్చే మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల పదకొండో తారీఖున ప్రారంభం కానున్నది.