ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి నిత్యం ఏదోక వార్తతో వివాదాల్లో నిలిచే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు.
ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనను తప్పు దారి పట్టిస్తున్నారని వర్మ అన్నాడు. ఇకనైనా తన చుట్టూ ఉన్న ప్రమాదకరమైన వ్యక్తుల పట్ల జగన్ అప్రమత్తంగా ఉంటారని నమ్ముతున్నా అని ఆయన అన్నాడు.
ఆ పార్టీలో తాను గౌరవించే వ్యక్తి ఒక్క వైఎస్ జగన్ మాత్రమే అని వర్మ ఈ సందర్భంగా వెల్లడించాడు.ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం, వర్మ మధ్య ఫైట్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.