ఏపీలో రాజకీయం మంచి రసపట్టులో ఉంది.అధికార ప్రతిపక్ష పార్టీలకి చెందిన నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతుంది.అధికార వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత,మంత్రి కోడాలి నాని అయితే ఏకంగా మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాటల యుద్ధం ఇంకా తీవ్రతం చేస్తున్నాడు.
తాజాగా మంత్రి కోడాలి నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని అధికారంలో నుండి..సీఎం కుర్చీ నుండి దించి చంద్రబాబు నాయుడు సీఎం అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పి రాష్ట్రం విడిచిపెట్టిపోతాను.ఒకవేళ చంద్రబాబు దించలేకపోతే తాను కుప్పం కి పరిమితం అవ్వగలడా అని సవాల్ విసిరాడు..