దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలోనే అక్కడ 20,181 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి నలుగురు మరణించారు. ఈమేరకు ఎంబీసీ బులెటిన్ విడుదల చేసింది. అక్కడి స్లమ్ ఏరియా ధారావిలో 107 మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం ముంబైలో 79,260 యాక్టివ్ కేసులున్నాయి.
