కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోట్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
‘ఈ సాయంత్రం కరోనా టెస్టు చేయించుకున్నాను. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఇతర సమస్యలు ఏమి లేవు. నాతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి.అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి..అందరూ మాస్కులు ధరించాలని .’ అని ట్వీట్ చేశారు.