తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్.. మరో గుడ్ న్యూస్ చెప్పింది. రీవాల్యూ యేషన్, రీకౌంటింగ్ కోసం అప్లై చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. విద్యార్థులు చెల్లించిన ఫీజు తిరిగి పొందవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి తమ కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా నగదు తీసుకోవచ్చని తెలిపింది.