దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఏకంగా 1,17,100 కొత్త కేసులు వచ్చాయి. కరోనా బారిన పడి మరో 302 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 4,83,178కు చేరింది.
దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 7.74%కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న 90వేల కేసుల రాగా.. ఒక్కరోజులో 27వేల కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.