దేశంలో రోజు రోజుకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే తాజాగా తొలి ఒమిక్రాన్ మరణం నమోదయింది.
రాజస్థాన్లో ఒమిక్రాన్ సోకిన 72ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవల మహారాష్ట్రలో ఓ బాధితుడు ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్లు వార్తలు రాగా.. అది ఒమిక్రాన్ మరణం కాదని తేలింది.