మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ భయోత్పాతం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో అక్కడ 144 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఒక్క ముంబైలోనే 100 కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
కాగా గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 26,538 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. రికవరీ రేటు 96.55శాతానికి తగ్గింది.