బంగార్రాజు ప్రమోషన్ మీట్లో సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున సినిమా టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తొలిసారి స్పందించాడు. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తమ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించాడు.
రేట్లు ఎక్కువగా ఉంటే డబ్బు ఎక్కువగా వస్తుందని.. తమ సినిమా వసూళ్లు కొంచెం తగ్గినా పరవాలేదన్నాడు. రేట్లు పెంచలేదని ‘బంగార్రాజు’ను జేబులో పెట్టుకుని కూర్చోలేం కదా అని తెలిపాడు. కరోనాకు భయపడట్లేదని, జనవరి 14న బంగార్రాజు రిలీజ్ చేస్తామన్నాడు.