తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది.
ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సుమారు 40వేల పరీక్షలు చేస్తున్నారు. తాజాగా ఆ సంఖ్యను లక్షకు పెంచాలని వైద్యారోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇంటి వద్దే యాంటీజెన్ టెస్టు చేసుకోవడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు 2 కోట్ల ర్యాపిడ్ కిట్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది.