తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలోనే అత్యధికంగా మామిడి పంట కొల్లాపూర్ ప్రాంతంలోనే పండుతుంది.. ఇక్కడ్నుంచి దేశవిదేశాలకు ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో స్థానిక రైతులు తమ పంటను అమ్ముకునేందుకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వరకు రావాల్సి వస్తోంది.