కరోనా పీక్ టైంలో విడుదలై ఘన విజయం సాధించిన క్రాక్ మూవీ తర్వాత వరుస సినిమాలతో స్టార్ సీనియర్ హీరో.. మాస్ మహారాజ రవితేజ బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం.. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న రావణాసుర మూవీ ఈ నెల 14న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది.
అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం హీరోయిన్ దక్ష నగార్కర్ ను ఈ చిత్రం యూనిట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో నెగెటివ్ షేడ్ పాత్రలో ఆమె కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.