తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా,ఈ నెల 10న తలపెట్టిన ‘తెలంగాణ బంద్’ను ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. అలాగే ఈ నెల 8 నుంచి BJP తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.
కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు జీవో 317తో అన్యాయం జరుగుతోందని, దానికి సవరణలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతోపాటు అక్రమ అరెస్టులను నిరసిస్తూ తొలుత బంద్ కి పిలుపునిచ్చింది.