ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒమిక్రాన్ బారినపడి 108 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో 4,70,462 ఒమిన్ కేసులు నమోదైనట్లు పేర్కొంది.
యూకేలో అత్యధికంగా 2,46,780 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, డెన్మార్క్ 57,125, USA 42,539, జర్మనీలో 35,529 చొప్పున కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు వివరించింది. కాగా దేశంలో ప్రస్తుతం 2,135 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు తెలిపింది.