యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా కేవలం 46.5 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. దీంతో తొలిరోజు ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.
వార్నర్ 30, హారిస్ 38, లబుషేన్ 28 రన్స్ చేసి ఔట్ కాగా.. స్మిత్ 6నాటౌట్, ఖవాజా 4నాటౌట్తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, బ్రాడ్, వుడ్ తలో వికెట్ తీశారు.