సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 202 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో కెప్టెన్ రాహుల్(50), అశ్విన్(46), మయాంక్ (26), విహారి (20) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 4, ఒలీవియర్, రబాడా చెరో 3 వికెట్లు తీశారు. చివర్లో అశ్విన్ పోరాటంతో భారత్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.
