తెలంగాణలోకరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
పడకలు, ఆక్సిజన్, మందులు, పరీక్ష కిట్లు అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. అన్ని దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఖాళీలు ఉంటే 15 రోజుల్లోగా భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలని కేసీఆర్ సూచించారు.