తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, ఇబ్బందులపై పలువురు స్పందిస్తుండగా.. టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి కొత్త ప్రతిపాదన చేశాడు. తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పెద్ద దిక్కుగా చూడాలని ఉందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ‘మా బాస్ ఇండస్ట్రీ పెద్దగా ఉండాలి. దాన్ని చూడాలని నా కోరిక. సామీ మీరు రావాలి సామీ’ అని అజయ్ ట్వీట్ చేశాడు.
