తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేనప్పుడు హీరోయిన్లు ఎంచుకునే మార్గం ఐటెం సాంగ్స్..స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మొదలు తమన్నా వరకు అందరూ ఐటెం సాంగ్స్ లో ఆడిపాడినవారే.. తాజాగా ఇటీవల అక్కినేని కుటుంబం నుండి దూరమై…అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఐటెం సాంగ్స్ లో నటించిన చిత్రం పుష్ప..ఈ చిత్రంలోని ఊ అంటవా మావ ఊఊ అంటవా అనే పాట సినిమాకే హైలెట్ గా నిలిచింది.
ఈ పాటలో సమంత అందాలన్నీ ఆరబోసింది.దీంతో సమంత బాటలో నడవనున్నది మరో అందాల రాక్షసి రెజీనా..ఈమధ్య కాలంలో కొత్త, పాత తేడా లేకుండా హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు.
తాజాగా రెజీనా ఆడిపాడిన ‘శానా కష్టం’ పాట ప్రోమో కూడా రిలీజ్ అయింది. హీరోయిన్ గా సరైన అవకాశాలు రాబట్టుకోలేకపోతున్న రెజీనా.. ఈ సాంగ్తోనైనా తిరిగి పుంజుకుంటుందేమో వేచి చూడాలి. ఇదిలా ఉండగా.. గతంలో కాజల్ కూడా ‘పక్కా లోకల్’ అంటూ ఐటమ్ సాంగ్ స్టెప్పులేసిన విషయం మనకు తెలిసిందే.