నేషనల్ క్రష్ రష్మికా మందాన స్టార్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందా..?. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందా..?. కొత్త సంవత్సరం సందర్భంగా ఆ హీరోతో డేటింగ్ కెళ్లిందా అంటే అవుననే అంటున్నారు సినీ క్రిటిక్స్.
అసలు విషయానికి వస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రౌడీ ఫెలో ..యువస్టార్ హీరో విజయ్ దేవరకొండ( VDK), రష్మిక గోవా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా లీకైన ఓ ఫోటో ఆ వార్తలకు బలం తెచ్చింది. ‘Happy 2022 my loves’ అంటూ రష్మిక ఓ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
కాసేపటికే VDK తమ్ముడు ఆనంద్ విషెస్ చెబుతూ ఓ ఫొటో షేర్ చేశాడు. ఆ ఫొటోలో VDK ఉన్నట్లు తెలుస్తుంది.. ఆ లోకేషన్ సేమ్ ఉంది. దీంతో VDK, రష్మిక డేటింగ్లో ఉన్నట్లు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..