ఏపీలో పలు కారణాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు గడువిస్తున్నట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ లోపు ప్రభుత్వం స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయకుంటే.. సంక్రాంతి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతారని చెప్పారు.
గుంటూరులో జరిగే ధర్నాలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. పల్నాడు ప్రాంతంలో 4లక్షల ఎకరాల్లో మిర్చి వేసిన రైతులు ఎకరాకు రూ.70 వేల చొప్పున నష్టపోయారని నాదేండ్ల పేర్కొన్నారు.