ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ కరోనా బారిన పడ్డాడు. ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వరుడ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్లో భాగంగా 4వ టెస్టు జనవరి 5న ప్రారంభం కానుంది.
క్యాన్సర్ బాధితుల కోసం రాబోయే టెస్టులో గ్లెన్ మెక్ గ్రాత్ ఫండ్ రైజింగ్ డ్రైవ్ తలపెట్టాడు. కరోనా సోకడంతో ప్రస్తుతం గ్లెన్ మెక్ గ్రాత్ ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నాడు.