టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమిస్తారని అస్సలు ఊహించలేదని భారత మాజీ సెలెక్టర్, వికెట్ కీపర్ సబా కరీమ్ అన్నాడు. ‘ఈ విషయం తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను.
రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాను. అతడు మల్టీ ఫార్మాట్ ప్లేయర్. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పంత్ అద్భుతంగా రాణించాడు. పంత్కి కెప్టెన్సీపై అవగాహన ఉంది’ అని కరీమ్ పేర్కొన్నాడు.