తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న నందమూరి అందగాడు..యువరత్న బాలకృష్ణ ఏకంగా ఒకరికి ఆన్ లైన్లో ఫోన్ చేసి మరి ఐలవ్యూ చెప్పాడు.
అసలు విషయానికోస్తే ఆహాలో ప్రసారమై ‘అన్ పబుల్’ కార్యక్రమంలో హీరో రానా అడిగిన మేరకు.. బాలకృష్ణ తన భార్యకు ఫోన్లో ప్రపోజ్ చేశాడు. ‘వసూ.. ఐ లవ్ యు’ అని తన ప్రేమను వ్యక్తం చేయగా ‘నాకు తెలుసు మీరెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు’ అంటూ వసుంధర సమాధానమిచ్చారు.
ఈ షోకి రానా అతిథిగా వచ్చాడు. ఈ క్రమంలో ‘మీరెప్పుడైనా వసుంధరగారికి ఐ లవ్ యు అని చెప్పారా’ అని రానా అడగ్గా నికేందుకయ్యా అని బాలయ్య బదులిచ్చాడు. తర్వాత కాల్ చేసి ప్రపోజ్ చేశాడు.