దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఒక్కరోజే 8 వేల 36 కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇది 2 వేలు ఎక్కువ. మహారాష్ట్రలో మొత్తం 11,877 కొత్త కేసులు వచ్చాయి.
9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 3,194 మంది వైరస్ బారినపడ్డారు. 1156 మంది కోలుకున్నారు. దేశరాజధానిలో ప్రస్తుతం 8,397 యాక్టివ్ కేసులున్నాయి. బెంగాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. 6,153 మందికి వైరస్ సోకింది.