ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని పలు హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించాయి. నమాజ్‌ను వ్యతిరేకిస్తూ, నాథూరాం గాడ్సేను పొగుడుతూ ఆయా సంఘాల నేతలు గురుగ్రామ్‌లో శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
22 సంఘాలకు చెందిన ఆందోళనకారులు ఈ నిరసనల్లో పాల్గొనడం గమనార్హం. గురుగ్రామ్‌లోని సివిల్ లైన్స్ వద్ద డిప్యూటీ కమిషనర్ ఇంటి నుంచి కార్యాలయం వరకూ పాదయాత్ర సాగింది. రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ రాసిన ఒక మెమొరాండంను వారు డిప్యూటీ కమిషనర్‌కు సమర్పించారు.
అందులో తమ డిమాండ్లను పేర్కొన్నారు. ఈ మార్చ్‌కు సం యుక్త్ హిందూ సంఘర్ష్ సమితికి చెందిన కుల్‌భూషణ్ భరద్వాజ్ నేతృత్వం వహించగా, గో రక్షణ దళ్, భజరంగ్ దళ్, హిందూసేన వంటి హైందవ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.