దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఐదోరోజు ఆటలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రవర్తించిన తీరును బ్యాటింగ్ దిగ్గజం గవాస్కర్ తప్పుపట్టాడు. సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ బవుమా పరుగు కోసం ప్రయత్నించకున్నా..సిరాజ్ అతడివైపు బంతి విసరడమేమిటని సన్నీ ప్రశ్నించాడు.
సిరాజ్ బౌలింగ్‌లో డిఫెన్సివ్‌గా ఆడిన బవుమా పరుగుకోసం ప్రయత్నించకున్నా.. ఫాలో అప్‌లో బంతిని అందుకున్న భారత పేసర్ దానిని బవుమాపైకి విసిరాడు. దాంతో బంతి ఎడమ పాదానికి తగిలి సౌతాఫ్రికా బ్యాటర్ గాయపడ్డాడు.
దీనిపై గవాస్కర్ స్పందిస్తూ.. ‘బవుమా పరుగుకోసం ప్రయత్నమే చేయలేదు. కానీ సిరాజ్ చాలా దూకుడుగా వ్యవహరించాడు. అతడితో జట్టు యాజమాన్యం మాట్లాడాలి’ అని సూచించాడు.