తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయం కాగా, ప్రజలపై మరో భారం పడనుంది. సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పల్లెవెలుగు బస్సులకు కి.మీ.కు 25 పైసలు, ఎక్స్ప్రెస్ ఆ పైన బస్సులకు కి.మీ.కు రూ.30 పైసల చొప్పున పెంచాలన్న TSRTC ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, అనుమతి రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.