కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వస్త్రాలపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని లేఖలో కోరిన ఆయన.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలన్నారు.
జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందన్న మంత్రి కేటీఆర్ కోట్లాది మంది చేనేతల జీవితాలు దెబ్బతింటాయన్నారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్న మంత్రి.. రైతుల మాదిరిగా నేతన్నలు కూడా కేంద్రంపై తిరగబడతారన్నారు.