బాలీవుడ్ నటి నోరా ఫతేహికి కోవిడ్ సోకింది. తాను కోవిడ్ తో తీవ్రంగా బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఆమె పేర్కొంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపిన నోరా.. అందరూ జాగ్రత్తగా ఉండాలి..
మాస్కులు ధరించాలని కోరింది. వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్న ఫతేహి.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని తెలిపింది. కాగా ప్రభాస్ ‘బాహుబలి’లో స్పెషల్ సాంగ్లో ఈమె నటించింది.