తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కు పెరిగింది. వీరిలో 22మంది కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు.
కాగా గత 24 గంటల్లో కొత్తగా 280 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఒకరు చనిపోయారు. నిన్న మరో 206 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,563 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.