నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. అలాగే ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ క్యాలరీలను బర్న్ చేస్తూ.. కొవ్వును నిల్వ ఉండకుండా చేస్తుంది.
క్రమం తప్పకుండా లెమన్ జ్యూస్ తాగితే జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అయితే దీని ప్రయోజనాలు పొందాలంటే నిల్వ చేసిన నిమ్మరసం తాగకూడదు.