తెలంగాణలోని నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31న రూ.110 కోట్లతో చేపట్టే ఐటీ హబు శంకుస్థాపన చేస్తామన్న సీఎం కేసీఆర్ నగరంలో 2 ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు.
రూ.36 కోట్లతో కొత్త డిగ్రీ కాలేజీ భవనం నిర్మించాలన్న సీఎం.. పట్టణాన్ని సుందరంగా మార్చాలన్నారు. కాగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ నిన్న బుధవారం నల్గొండ పర్యటనకు వెళ్లారు.