మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కు పెరిగింది.
వీటిలో ఒక ముంబైలోనే 137 కేసులు ఉన్నాయి. మరోవైపు గత 24గంటల్లో కొత్తగా 3,900 కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ వల్ల 20 మంది చనిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం 14,065 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.