దేశ ఆర్ధిక వ్యవస్థకి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి….. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతుల ఖాతాలలో రైతు బందు డబ్బులు జమ చేస్తున్న సందర్బంగా సీఎం కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం చేశారు.
కరోనా మహమ్మారి కారకణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన కూడా రైతుల సంక్షేమం కోసం 2021-22 యాసంగి పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి వర్ధన్నపేట నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రైతు బందు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.