తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,023 టెస్టులు చేయగా.. 235 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరాయి..
గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.