ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రచ్చ లేపుతున్నా.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు హీరోలు, డైరెక్టర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు.
అయితే విష్ణు ఇంతవరకు నోరు విప్పలేదు. కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. సీఎం జగన్ బంధుత్వం వల్లే విష్ణు సైలెంట్ గా ఉంటున్నారని కొందరు వాదిస్తున్నారు.