ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘పుష్ప’ సినిమా కోసం పని చేసిన కిందిస్థాయి సిబ్బందికి డైరెక్టర్ సుకుమార్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టెక్నీషియన్స్, సెట్ బాయ్స్ పాటు సినిమా కోసం పనిచేసిన సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాడు.
మూవీ షూటింగ్ సమయంలో వారందరూ అడవుల్లో ఎంతో కష్టపడ్డారని సుకుమార్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది.