ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 75కే చీప్ లిక్కర్, ఇంకా కుదిరితే రూ.50కే ఇస్తామంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
‘వావ్… ఏమి పథకం! ఎంత అవమానకరం. ఏపీలో బీజేపీ మరింత దిగజారింది’ అంటూ ఎద్దేవా చేశారు. చీప్ లిక్కర్‌ను రూ.50కే సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానమా? లేక నిరాశ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనా ఈ బంపర్ ఆఫర్? అంటూ ప్రశ్నించారు.