దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 781 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.
అత్యధికంగా ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇక తెలంగాణలో 62 కేసులు రాగా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు.