తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం అమలులో భాగంగా 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి జమ చేస్తారు.
గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ, 10 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈసారి 66,61,638 మంది రైతులకు లబ్ధి పొందనున్నారు. మొత్తం కోటి 52 లక్షల 91 ఎకరాలకు రైతుబంధు ద్వారా పెట్టుబడి అందనుంది.