కేంద్రం ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్రంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వలపుబాణాలు విసురుకొంటున్నాయని విమర్శించారు.
విత్తనాలకోసం, ఇంటి అవసరాల కోసం మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే వారి వేసుకోవచ్చని గతంలోనే ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ రేవంత్కు భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకోవచ్చని మంత్రి సూచించారు.