తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ లో కేసు నమోదైంది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 504 సెక్షన్ కింద కేసు నమోదైంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పీఎస్ లో తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.
